Breaking News

ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్‌

Published on Wed, 01/29/2025 - 21:31

చెన్నై:  తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్‌ మీదగా వెళుతోంది. ఆ సమయంలో  ఓ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు.  

ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్‌లో డీఎంకే జెండా ఉన్న ఎస్‌యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు.  .

బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది.  

ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)