Breaking News

2012లో ఇంజినీరింగ్‌ .. 2023లో ఎంబీబీఎస్‌.. తీరని కల నెరవేరుతోందిలా..

Published on Sun, 08/06/2023 - 11:49

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్‌ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గల షహీద్‌ నిర్మల మెహతో మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. విద్యార్థి చందన్‌ కుమార్‌ ఎడ్మిషన్‌ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్‌ ఎంబీబీఎస్‌ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం. 

ఎన్‌ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి
చందన్‌ కుమార్‌ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్‌ తీసుకునేందుకు వచ్చిన చందన్‌ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్‌ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్‌ టూ పూర్తి చేసిన అనంతరం చందన్‌ అటు మెడికల్‌, ఇటు ఇంజినీరింగ్‌ రెండింటిలో ఎడ్మిషన్‌ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. ఎన్‌ఐసీ వరంగల్‌(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు.

ప్రత్యేక శిక్షణ లేకుండానే..
అయితే ఎంబీబీఎస్‌ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్‌ ఎంట్రన్స్‌ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్‌ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్‌ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎ‍క్కడా కోచింగ్‌ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు. 

భార్య ఎస్‌బీఐలో మేనేజర్‌
ఏఎన్‌ఎంఎంసీహెచ్‌ సూపరింటెండెంట్  అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక డాక్టర్‌ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్‌ కుమార్‌ భార్య అపర్ణ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్‌ సోదరి గౌరి కుమారి బీహార్‌ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది.
ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్‌ బాండ్‌’ సౌదీలో ఏం చేస్తున్నారు?

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)