Breaking News

పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Published on Sat, 01/31/2026 - 11:11

లక్నో: పోలీసులు జరుపుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు పలువురు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపి, వాటిని ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరించే ధోరణిపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుల కాళ్లపై కాల్పులు జరపవచ్చని పోలీసు అధికారులకు ఏవైనా మౌఖిక లేదా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారా? అని రాష్ట్ర డీజీపీ, హోం సెక్రటరీని కోర్టు ప్రశ్నించింది. ఈ తరహా ఘటనలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని యూపీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికో లేదా నిందితులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శిక్షగా వారి కాళ్లపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం గమనార్హమని వ్యాఖ్యానించింది. శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకే ఉంటుందని, పోలీసులకు కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల విధులు స్పష్టంగా నిర్వచించారని కోర్టు గుర్తుచేసింది. న్యాయ వ్యవస్థ పరిధిలోకి పోలీసులు చొరబడటం ఎంతమాత్రం సహించబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

చిన్నపాటి నేరాలకూ తూటాలేనా?
దొంగతనం లాంటి చిన్నపాటి నేరాల్లో కూడా పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ, వాటిని ఎన్‌కౌంటర్లుగా సృష్టిస్తున్నారని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ఎన్‌కౌంటర్లలో గాయపడిన ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను విచారించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ ఘటనల్లో ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా గాయం  కాలేదనే విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. 

ఇది  కూడా చదవండి: ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు