Breaking News

యూపీలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం

Published on Mon, 12/23/2024 - 10:16

పిలిభిత్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా రచించిన వ్యూహంలో ఘనవిజయం సాధించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌కు చెందినవారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో గురుదాస్‌పూర్ పోస్ట్‌పై గ్రెనేడ్ విసిరారు. పురాన్‌పూర్ ప్రాంతంలోని హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

హతమైన ఉగ్రవాదులను ప్రతాప్ సింగ్ (23), వీరేంద్ర సింగ్ (23), గుర్విందర్ సింగ్ (20)గా పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పోలీసు పోస్ట్‌పై దాడి చేసిన కేసులో ముగ్గురినీ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పంజాబ్ పోలీసులు వీరి ఆచూకీని పిలిభిత్‌లోని పురాన్‌పూర్‌లో గుర్తించారు. అనంతరం వారు పిలిభిత్ పోలీసుల సహాయంతో, సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ జరిగింది.

బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు వ్యాపించాయి. ఏం జరిగిందో స్థానికులకు వెంటనే అర్థం కాలేదు. తొలుత ఎన్‌కౌంటర్‌లో గాయపడిన నిందితులతో పోలీసులు పురాన్‌పూర్‌ సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి వారు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)