Breaking News

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

Published on Wed, 09/17/2025 - 15:37

ముంబై: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతబలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

బుధవారం ఉదయం మహరాష్ట్ర పోలీసులు,భద్రత బలగాలకు గడ్చిరోలి జిల్లాలోని దండకారణ్యంలో ఎటపల్లి తాలూకాలోని మోదస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్‌ నిర్వహించాయి.  

 గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ-నక్సల్ కమాండో దళం  సీ-60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుండి పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. సీ-60 దళం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోల ఎదురు కాల్పులు పోలీసులు తిప్పికొట్టారు. ఇద్దరు మహిళా నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)