Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 30 మంది నక్సల్స్‌ మృతి

Published on Fri, 10/04/2024 - 16:10

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది.  శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో  30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పుర్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

దంతెవాడ, నారాయణ్‌పుర్‌ పోలీసుల సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం  మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో  పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం.  గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస  ఎన్‌కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌  నేపథ్యంలో  కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌  తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: కాంగ్రెస్‌ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్‌ షా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)