Breaking News

కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఒక జవాను వీరమరణం

Published on Sat, 07/27/2024 - 09:55

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్‌ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు.  

ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్‌లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్,  జైష్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ప్రస్తుతం మచల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక బ్యాట్‌ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్‌ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్‌లో పడి ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)