Breaking News

‘మీకు నచ్చకపోతే, నా తల తీసుకెళ్లండి’.. ఉద్యోగులపై మండిపడ్డ సీఎం!

Published on Tue, 03/07/2023 - 15:45

డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేని కారణంగా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగుల డీఏ పెంపు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మమతా మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు.

చాలకపోతే.. నా తల నరకి తీసుకెళ్లండి
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇకపై డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా ఎంత కావాలి? ప్రభుత్వం ప్రకటించిన డీఏ పట్ల మీరు సంతోషంగా లేకుంటే నా తల నరికి తీసుకెళ్లండి ”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ విధానం వేరువేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? ’అని మండిపడ్డారు.

ఫిబ్రవరి 15న, అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి.. ఉపాధ్యాయులతో సహా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు, ప్రాథమిక వేతనంలో 3% డియర్‌నెస్ అలవెన్స్‌గా ప్రభుత్వం ఇస్తోంది. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు సవరించిన డియర్‌నెస్ అలవెన్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న డియర్‌నెస్ అలవెన్స్‌తో (డీఏ) పోలిస్తే పెంపుదల చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వ భావించారు. అందుకే పెంపుపై అసంతృప్తితో నిరసనలు చేపట్టారు.

చదవండి: తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)