Breaking News

అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి

Published on Thu, 10/31/2024 - 14:12

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో  ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. 

ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు  తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన  ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. 

కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్‌ గింజలు  ఫంగస్‌తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)