Breaking News

ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!

Published on Sat, 09/02/2023 - 12:41

రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్‌ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్‌ పోలీస​్‌ స్టేషన్‌ పరిధిలోని ఆరంగ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్‌ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్‌సింగ్‌ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ‍ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు.

బాధితుల అరుపులు విన్న అర్జున్‌ సింగ్‌ బంధువు హఠెసింగ్‌ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే  అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్‌ అంజుమ్‌ తాహిర్‌ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్‌ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.   
ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)