Breaking News

దాద్రా, నగర్‌ హవేలీ స్థానికంలో బీజేపీ రిగ్గింగ్‌ 

Published on Mon, 10/27/2025 - 06:10

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్‌ హవేలీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని దాద్రా, నగర్‌ హవేలీ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే ఆరోపించారు. స్థానిక అధికారులతో కలిసి కుమ్మక్కై 80 శాతం వరకు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను తిరస్కరించేలా బీజేపీ చేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులకు పోటీకి ఎవరూ లేకుండా చేసిందని, ఇది ఓటు చోరీకి మించిన కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు తప్ప వేరెవరి నామినేషన్‌ పేపర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదన్నారు.

 నామినేషన్‌ పత్రాల కోసం వెళితే సంబంధిత అధికారులు శిక్షణకు వెళ్లినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారని, ఎలాగోలా పత్రాలను పూర్తి చేసి చేతికందిస్తే పరిశీలనలో తిరస్కరించారని ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌ ఒక్కటీ తిరస్కరణకు గురి కాలేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బాంబే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. డామన్, డయ్యూలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని ఠాక్రే ఆరోపించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారులు, బీజేపీ స్పందించాల్సి ఉంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)