Breaking News

Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపే లాస్ట్‌ డేట్‌

Published on Thu, 04/25/2024 - 16:59

హైదరాబాద్‌, సాక్షి: ‘‘సమయం లేదు మిత్రమా’’.. అంటూ రాజకీయ నేతలు త్వరపడాల్సిన టైం వచ్చింది. ఇటు తెలంగాణ లోక్‌సభ, అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి తేదీ. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. 

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. నాలుగో దశలో తెలంగాణ(17), ఏపీ(25) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

  • తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటిదాకా(మంగళవారం నాటికి) 415 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 
  • ఏపీలో 25 పార్లమెంట్‌ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 
  • ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలు అయ్యాయి.  

ఏప్రిల్‌ 18వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. ఎల్లుండి.. అంటే 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)