Breaking News

ఒక్క ఫోన్‌ కాల్‌.. భారీగా దొరికిన నగదు

Published on Sat, 04/13/2024 - 07:25

చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్‌సభకు పోలింగ్‌కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం.

తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్‌లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్‌లోని ఎలక్షన్‌ కంట్రోల్‌ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)