Breaking News

అనుమానాలుంటే హైకోర్టుకు వెళ్లండి 

Published on Mon, 06/09/2025 - 05:27

న్యూఢిల్లీ:  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొట్టిపారేసింది. అందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. ‘‘ఎన్నికల ప్రక్రియపై అనుమానాలుంటే నేరుగా మాకు లేఖ రాయండి. బదులిస్తాం. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. 

మహారాష్ట్ర పోలింగ్‌ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ పిటిషన్‌ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఫుటేజీని న్యాయస్థానం క్షుణ్నంగా పరిశీలిస్తుంది’’ అని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సమగ్రత, ఓటర్ల గోప్యతను ఈసీ కచ్చితంగా పరిరక్షిస్తుందని తెలిపాయి. ఓటర్ల గోప్యతపై దాడి చేయాలనుకోవడం సరైంది కాదని సూచించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్‌ చేసిన ఆరోపణలను ఖండించాయి. 

కాంగ్రెస్‌ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్‌స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్‌ ఏజెంట్లను రాహుల్‌ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15న కాంగ్రెస్‌ నేతలను ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టంచేశాయి.

ప్రజాతీర్పు అపహాస్యం: ఫడ్నవీస్‌
ముంబై:  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందీ సమీక్ష చేసుకోకుండా ప్రజాతీర్పును రాహుల్‌ అపహాస్యం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడాన్ని తట్టుకోలేక నిందలు వేస్తున్నారని ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆరోపించారు. శనివారం రాహుల్‌ కూడా అదే పత్రికకు రాసిన వ్యాసంలో మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. ‘‘మ్రహారాష్ట్రలో భారీగా బోగస్‌ ఓటర్లను చేరి్పంచారని, సాయంత్రం ఓటింగ్‌ శాతం అకస్మాత్తుగా పెరిగిందని అనడం పెద్ద జోక్‌. యువ ఓటర్ల సంఖ్య పెరగడం మామూలే. క్యూ నుంచున్న వారిని సమయం ముగిసినా ఓటేసేందుకు అనుమతి స్తారని తెలియదా?’’ అని ప్రశ్నించారు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)