Breaking News

ప్రశాంత్‌ కిశోర్‌కు రెండుచోట్ల ఓటు హక్కు

Published on Wed, 10/29/2025 - 05:59

పట్నా/కోల్‌కతా:  జన సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంతి కిశోర్‌కు రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. సొంత రాష్ట్రం బిహార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంగళవారం బిహార్‌ రాష్ట్రం రోహ్‌తస్‌లోని జిల్లా ఎన్నికల కార్యాలయం నోటీసు జారీ చేసింది. రెండుచోట్ల ఓటు హక్కు ఉండడం నిబంధనలకు విరుద్ధమే. ప్రశాంత్‌ కిశోర్‌కు బిహార్‌లోని కార్గాహర్‌ అసెంబ్లీ స్థానంలో ఓటు ఉంది. అలాగే పశి్చమ బెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో 121, కాళీఘాట్‌ రోడ్‌ చిరునామాతో మరో ఓటు ఉంది.

ఇది అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యా లయం చిరు నామా కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తగా సేవలందించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఒక్కరికి ఒక ఓటే ఉండాలి. రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం చట్టవిరుద్ధం. బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం కోసమే ప్రశాంత్‌ కిశోర్‌ అక్కడ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నట్లు జేడీ(యూ) ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ అనుమానం వ్యక్తంచేశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)