డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఘరానా మోసం 

Published on Mon, 01/12/2026 - 02:11

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వృద్ధ దంపతులు భారీ సైబర్‌ మోసానికి గురయ్యారు. డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.14.85 కోట్లు దోచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయటకు వచి్చంది. 81 ఏళ్ల ఓం తనేజా, ఆయన భార్య, డాక్టర్‌ అయిన 77 ఏళ్ల ఇందిర దశాబ్దాల పాటు అమెరికాలో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చి 2016 నుంచి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పిల్లలు విదేశాల్లోనే స్థిరపడ్డారు. 

దంపతుల పరిస్థితిని, ఒంటరితనం, వయస్సు, ఆరోగ్య సమస్యలను ముందే తెలుసుకున్న నిందితులు వారిని బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు దోచుకోవాలని పథకం పన్నారు. డిసెంబర్‌ 24న మధ్యాహ్నం 12 గంటలకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారినంటూ ఒక వ్యక్తి తనేజాకు కాల్‌ చేశాడు. వారి ఇంటినుంచి అశ్లీల కాల్స్‌ వెళ్లాయని, 26 మంది తనకు ఫిర్యాదు చేశారని చెప్పాడు. 

దంపతులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని బెదిరించాడు. కేసును మొబై పోలీసులకు బదిలీ చేస్తున్నామని చెప్పి.. అనంతరం కాల్‌ను వీడియో కాల్‌ మోడ్‌లోకి మార్చాడు. పోలీసు యూనిఫాంలో ఉన్న విక్రాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనే వ్యక్తి లైవ్‌లోకి వచ్చాడు. వృద్ధులు రూ.500 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బెదిరించాడు. వెంటనే ముంబైకి రావాలని హెచ్చరించాడు. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తాము రాలేమని చెప్పడంతో.. డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని చెప్పాడు. 

డిసెంబర్‌ 24 నుంచి జనవరి 9 వరకు వీడియో కాల్‌ ఆన్‌లోనే ఉంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చివరికి అమెరికాలో ఉన్న వారి పిల్లలకు కూడా చెప్పవద్దని హెచ్చరించాడు. డబ్బులు బదిలీ చేయాలని తనేజా దంపతులను డిమాండ్‌ చేశాడు. మొత్తం మీద, వారినుంచి రూ.14.85 కోట్లు తీసుకున్నారు. ఇదంతా ఆర్‌బీఐ నుంచి వాపస్‌ వస్తుందని నమ్మబలికారు. వారి వెరిఫికేషన్‌ 97 శాతం పూర్తయిందని చెప్పి జనవరి 8న మరో రూ. 50 లక్షలు డిమాండ్‌ చేశారు. జనవరి 9న కాల్స్‌ ఆగిపోవడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు.  

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)