Breaking News

హాట్‌ టాపిక్‌గా షిండే కుమారుడి వ్యాఖ్యలు!

Published on Sat, 06/10/2023 - 12:20

మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలతో సహా రాబేయే అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించిన కొద్దిరోజులకే శ్రీకాంత్‌ ఈవిధంగా వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

శుక్రవారం డోంబివలి యూనిట్‌లో శ్రీకాంత్ షిండే మాట్లాడారు. బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం షిండే వర్గానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తనకు ఏ పదవిపై కోరిక లేదన్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్నది కూటమే నిర్ణయింస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో  శివసేన కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే అన్నారు.

ఆ దిశగా తాము చేస్తున్న పనిని ఎవరైనా అడ్డుకున్నా.. లేదా కూటమిలో ఉంటూ ఇబ్బందులు పెట్టినా.. పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమేననన్నారు. భవిష్యత్తులో,  మంచి మెజారిటీతో గెలిచి, మహారాష్ట్రను అన్ని రంగాలలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేలా ప్రయత్నిస్తామని శ్రీకాంత్‌ షిండే చెప్పారు.

కాగా, లోక్‌సభ, విధానసభ మరియు స్థానిక సంస్థల ఎన్నికలతో సహా రాబోయే అన్ని ఎన్నికల్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని  నిర్ణయించుకున్నట్టు ఏక్‌నాథ్ షిండే ఈ నెల ప్రారంభంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

(చదవండి: మెల్లమెల్లగా బీజేపీ పట్టు కోల్పోతోంది.. నిన్న కర్ణాటక.. రేపు రాజస్థాన్.. )

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)