Breaking News

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏకనాథ్ షిండే

Published on Sat, 07/04/2026 - 11:16

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అనారోగ్యం బారినపడి, శనివారం థానేలోని జుపిటర్ ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన స్వల్ప జ్వరం, నీరసం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యుల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అధిక పనిభారమే కారణం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గత కొన్ని రోజులుగా పర్యటనలు, రాజకీయ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం, తీవ్రమైన పనిభారం కారణంగానే షిండే అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు జ్వరం వచ్చి, తీవ్ర నీరసానికి గురైనట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా షిండే శనివారం నాటి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయను చికిత్స నిమిత్తం థానేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే షిండే ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని శివసేన వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాల్లో షిండే చురుగ్గా పాల్గొన్నారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలతో పాటు ముంబయి శాసనమండలి సభ్యుడు సచిన్ అహిర్.. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ ‘ఆపరేషన్ టైగర్’ వ్యూహంలో షిండే కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పలుమార్లు ఢిల్లీ పర్యటనలు కూడా చేశారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)