Breaking News

యూపీలో రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ

Published on Tue, 02/27/2024 - 06:53

ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్‌ వాది(ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్  ఏర్పాటు చేసిన సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. 

వీరిలో ఎస్పీని వీడి బీజేపీలో చేరిన  ఎమ్మెల్యేలు రాకేశ్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, మహారాజీ ప్రజాపతి, పూజా పాల్, పల్లవి పటేల్ ఉన్నారు. దీంతో ఎస్పీలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని, ఈ విషయాన్ని ముందుగానే పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా నేడు (మంగళవారం) జరిగే  రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు లోక్ భవన్ ఆడిటోరియంలో శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. బీజేపీ ఓటింగ్ శిక్షణ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుభాఎస్పీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరైన ఓటింగ్ విధానాన్ని అధికారులు వారికి వివరించారు. 
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)