గుడ్డు సురక్షితమే! 

Published on Sun, 12/21/2025 - 05:09

న్యూఢిల్లీ: గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందంటూ వ్యాప్తిలో ఉన్న వదంతులను భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఖండించింది. అవన్నీ ప్రజల్లో అనవసరంగా భయాందోళనలను రేకెత్తించే తప్పుదోవ పట్టించే, శాస్త్రీయంగా నిరూపితం కాని వార్తలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

దేశంలో లభ్యతలో ఉన్న గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమైనవని తేల్చి చెప్పింది. గుడ్లలో ప్రమాదకరమైన రసాయనాలున్నాయంటూ వస్తున్న పుకార్లకు ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని తెలిపింది. భారత్‌లో విక్రయించే గుడ్లలో క్యాన్సర్‌ను కలిగించే నైట్రోఫురాన్‌ మెటబోలైట్స్‌(ఏవోజెడ్‌) ఉన్నాయంటూ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఇటీవల వస్తున్న కథనాల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది. 

ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విషపదార్థాలు, అవశేషాలు) నిబంధనలు–2011 ప్రకారం కోళ్ల పెంపకంతోపాటు గుడ్ల ఉత్పత్తి అన్ని దశల్లోనూ నైట్రోఫ్యూరాన్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని పేర్కొంది. 

ఒకవేళ అనుమతించిన దానికంటే తక్కువ స్థాయిలో స్వల్ప అవశేషాలు బయటపడినా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు, అలాగే దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని ప్రకటించింది. మన దేశంలో నియంత్రణలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని కూడా తెలిపింది. ఎక్కడో ఏవో కొన్ని ప్రయోగశాలల్లో వెలువడిన ఫలితాలను సాధారణీకరిస్తూ, గుడ్లు సురక్షితం కాదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరికాదని కూడా స్పష్టం చేసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)