Breaking News

రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌!

Published on Fri, 04/18/2025 - 08:21

బనశంకరి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదుచేసే కుక్క­ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశానని ప్రకటించిన బెంగళూరుకు చెందిన ఎస్‌.సతీశ్‌ ఇంటికి ఈడీ అధికారులు సోదాకొచ్చి షాకిచ్చారు. తోడే­లు– కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్క సంకరంతో పుట్టిన ఊల్ఫ్‌ డాగ్‌ అనే శునకాన్ని తాను భారీ ధర పెట్టి కొన్నానని, ప్రపంచంలో ఇలాంటి కుక్క ఇదొక్కటేనని కొన్నిరోజు­లు­గా ప్రచారం చేస్తున్నా­రు.

సోసల్‌ మీడియాలో ప్రచారంతో ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఈడీ అధికా­రు­లు సతీశ్‌ ఇంటికి వచ్చి సోదాలు చేశారు. ఫెమా చట్టం ఉల్లంఘన కింద దర్యాప్తు చేశారు. దర్యాప్తులో రూ.50 కోట్ల డబ్బు ఎక్కడిది, విదేశాలకు డబ్బు లావాదే­వీ­లు ఎలా జరిగాయి అనేది ప్రశ్నలు కురిపించారు. కుక్క కొనుగోలుకు సంబంధిత ఆధారాల్ని ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఈడీ అధికారుల ప్రశ్నలకు కంగుతిన్న ఎస్‌.సతీష్‌.. సోషల్‌ మీడియాలో తాను చూపించిన కుక్కకు అంత సీను లేదని, రూ.50 కోట్లకు కొనలేదని, ప్రచా­రం కోసం జిమ్మిక్కులు చేస్తున్నా­డని తెలిసి నివ్వెరపోయారు.

సోదాలపై ఈడీ పీటీఐ అధికారుల్ని సంపద్రించింది. ఈడీ అధికారులు సైతం ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసమే యజమాని సతీష్ రూ.50 కోట్ల కుక్క అంటూ ప్రచారం చేసుకున్నాడని, ఆ కుక్కను భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయలేదని తాము గుర్తించినట్లు చెప్పారు. అంతేకాదు రూ.50 కోట్లు అంటూ కుక్కపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ కుక్క ఖరీదు రూ.లక్షలోపే ఉంటుందని సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)