Breaking News

డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!

Published on Wed, 08/28/2024 - 17:09

చెన్నై : డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు భారీ షాకిచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులో బుధవారం ఈడీ అధికారులు తమిళనాడులో వ్యాపారవేత్త, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఫెమా చట్టం సెక్షన్‌ 37ఏ కింద రూ.89.19 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.908 కోట్లు జరిమానా విధించినట్లు ఎక్స్‌ వేదికగా ఈడీ వెల్లడించింది.  

జగత్రక్షకన్‌ ఎవరు?
జగత్రక్షకన్‌ తమిళనాడు డీఎంకే అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.  

డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్‌పై ఈడీ కేసు 
అయితే డిసెంబర్‌ 1,2021లో డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనల ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందినట్లు ఈడీ తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేపట్టామని, విచారణలో జగత్రక్షకన్‌పై ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ భారీ మొత్తంలో ఫైన్‌ విధించినట్లు ఈడీ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)