Breaking News

సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు 

Published on Fri, 01/31/2025 - 04:39

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్‌ కుమార్‌ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు.

 కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీపై కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్‌ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్‌ షా, నాయబ్‌సింగ్‌ సైనీ, రాహుల్‌ గాంధీ స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.  

కేజ్రీవాల్‌ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ  
యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్‌ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్‌ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు.   
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)