Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు

Published on Sat, 03/02/2024 - 05:06

సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్‌ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది.

ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్‌ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి.

ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్‌ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్‌ చేయడం మానుకోవాలని పేర్కొంది.
శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్‌ బుక్‌ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్‌ కుమార్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)