Breaking News

లోక్‌సభ ఎన్నికల్లోనే రికార్డు.. రోజుకు రూ. 100 కోట్లు

Published on Tue, 04/16/2024 - 15:01

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.  మార్చి 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.4,658  కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ 45 రోజుల్లో కోట్ల నగదుతోపాటు డ్రగ్స్‌, ఇతర వస్తువులు సీజ్‌ చేసినట్లు పేర్కొంది.

మొత్తం సొత్తులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటి వరకుసీజ్‌ అయిన రూ.778 కోట్లతో రాజస్థాన్‌ తొలి స్థానంలో ఉండగా.. అత్యల్పంగా లద్ధాఖ్‌లో రూ.11,580 మాత్రమే పట్టుబడింది. 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)