Breaking News

ప్రైవేటు ఛాపర్‌లో దిగిన శివకుమార్‌.. సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈసీ..

Published on Sat, 04/22/2023 - 15:27

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో, అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది.

ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా నేతలపై ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ ప్ర‌యాణించిన ఛాపర్‌లో ఈసీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఛాపర్‌లోని ప్రథమ చికిత్స కిట్‌ను, బ్యాగులను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్ర‌చారం కోసం ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలోని ధ‌ర్మ‌స్థ‌లికి చేరుకున్న త‌ర్వాత‌.. హెలిప్యాడ్‌లోనే శివ‌కుమార్ ప్ర‌యాణించిన ఛాపర్‌ను అధికారులు చెక్ చేశారు. ఈ సందర్బంగా ఛాపర్‌లో శివకుమార్‌ భార్య, పిల్లలు ఉన్నారు. 

ఈ సందర్బంగా డీకే శివకుమార్‌ మాట్లాడుతూ..  సోదాలు చేయ‌డంలో త‌ప్పులేద‌ని, వాళ్లు త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించారు. మంజునాథ స్వామిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను, రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పర్యటన తర్వాత ధర్మస్థలంలో ప్రచారం చేస్తాను అని కామెంట్స్‌ చేశారు. 

Videos

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

TDP అరాచకం.. సాక్షి రిపోర్టర్ సెల్ లాక్కొని దాడి

Photos

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)