Breaking News

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో 24న ఈసీ భేటీ

Published on Mon, 02/23/2026 - 06:34

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో మరింత సమన్వయం పెంచే దిశగా అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)లతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనుంది. చివరగా 1999 ఏడాదిలో ఇలాంటి భేటీ జరగ్గా 27 ఏళ్ల విరామం అనంతరం ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24న ఢిల్లీలోని భారతమండపంలో నిర్వహించనుంది.

 ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్‌లు డాక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, డాక్టర్‌ వివేక్‌ జోషి పాల్గొననున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు, వారి న్యాయ–సాంకేతిక నిపుణులు, అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం ప్ర ధానంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం. 

ఎన్నికల ప్రక్రియలు, సాంకేతిక వనరుల వినియోగంలో చర్చించనున్నారు. సహకార సమాఖ్య స్పూర్తిని మరింత బలపరచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో ఈవీఎంల భద్రత, ఓటర్ల జాబితా తయారీలో చట్టపరమైన మార్గ దర్శకాలు, రాష్ట్రాల వారీగా ఓటరు అర్హతలపై తులనాత్మక సమీక్ష, ఈసీఐనెట్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లపై చర్చించనున్నారు. దేశవ్యా ప్తంగా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)