Breaking News

వంటింటి వార్‌కు 'చెక్‌'..

Published on Thu, 03/12/2026 - 04:08

సాక్షి, స్పెషల్‌ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్‌ అయిపోతే? సిలిండర్‌ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్‌–ఇరాన్‌ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్‌ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. 

గ్యాస్‌ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్‌ స్టవ్‌ (ఇండక్షన్‌ కుక్‌టాప్స్‌), ఎలక్ట్రిక్‌ కుక్కర్, సోలార్‌ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్‌. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. 

వంటింటి శ్రమను తగ్గించేలా.. 
స్టవ్‌తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది.  

పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లు 
ఒకప్పుడు స్టవ్‌ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్‌ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్‌ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. 

మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్‌ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు. 

పొడులు 
ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. 

రెడీమేడ్‌ ఆవకాయ 
మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్‌ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్‌గా చేసుకుని ఫ్రిజ్‌లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు.  

చాలా సులభంగా 
బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్‌ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి. 

మంచి ప్రత్యామ్నాయం 
తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులు 
కూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనేవెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచిప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ.  

మిక్స్‌డ్‌ సలాడ్లు 
మొలకలు (పెసలు, శనగలుమొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్‌ రూట్‌ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఫ్రూట్‌ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్‌ కావాలంటే కలుపుకోవచ్చు) 

పెరుగు పచ్చడి 
పెరుగు పచ్చడి చాలాసులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినాఫర్వాలేదు. ముల్లంగిపెరుగు పచ్చడి, పచ్చిపులుసు వంటివి అప్పటికప్పుడుతయారుచేసుకోవచ్చు. 

కొబ్బరి తురుముతో 
పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్‌ తురుము, కీరా ముక్కలు, 
నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే  కోసంబరి సిద్ధం. 

ఈ రెడీమేడ్‌ లడ్డూలు–తీపి పొడులు 
కేవలం వంటలే కాదు టైమ్‌ పాస్‌కి, స్నాక్స్‌లా తినడానికి రెడీమేడ్‌గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్‌మిస్‌ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)