Breaking News

టిబెట్‌ను వణికించిన భూకంపం

Published on Wed, 01/08/2025 - 01:33

బీజింగ్‌: చైనాలోని అటానమస్‌ ప్రాంతం టిబెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో చోటుచేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజెపై ఎక్కువగా పడింది. అక్కడ నివాస భవనాలు కూలడం వంటి ఘటనల్లో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా జియోలాజికల్‌ విభాగం అంటోంది.

ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, అధికారులు ఆహార పదార్థాలు, మంచినీరుతోపాటు కాటన్‌ టెంట్లు, కాటన్‌ కోట్లు, కిల్టులు, బెడ్లు తదితరాలను హుటాహుటిన పంపించారు. జిగాజె ప్రాంతాన్ని షిగస్తె అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌తో సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో షిగస్తె ఒకటి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంగా భావించే పంచన్‌ లామా ఉండేది షిగస్తెలోనే. భూకంప కేంద్రం డింగ్రి కౌంటీలోని త్సొగోలో ఉంది.

భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని లొబుట్సెకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూ ప్రకంపనల ప్రభావంతో నేపాల్‌లోని కవ్‌రెపలన్‌చౌక్, సింధుపలన్‌చౌక్‌ ధడింగ్, సొలుకుంభు జిల్లాలతోపాటు రాజధాని కఠ్మాండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)