Breaking News

మహారాష్ట్రలో భూకంపం

Published on Thu, 07/09/2026 - 14:51

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత  హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు  భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుజామునహింగోలి జిల్లాలో వరుసగా భూమి స్వల్పంగా కంపించింది. రెండు గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది.   హింగోలిలో నమైదన భూకంపం 4.6 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఈ నాలుగు భూకంపాలు హింగోలి జిల్లాలోని సమీప ప్రాంతాలలోనే సంభవించాయని, 10 కిలోమీటర్ల లోతులో ఇవి నమోదైనట్లు పేర్కొన్నారు. వీటితో పాటు లాతూర్, పర్భణి, నాందేడ్ సహా పొరుగు జిల్లాల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయి. 

జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఇలాంటి భూకంపాలు చాలాసార్లు సంభవించాయి. జూలై 2, 2026న, హింగోలిలో 5 కిలోమీటర్ల లోతులో 3.6, 3.5 తీవ్రత గల రెండు భూకంపాలు నమోదయ్యాయి. అంతకుముందు, ఏప్రిల్ 11, 2026న,  10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా ఇటీవల ఇలా  వరుసగా భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది.

 

Maharashtra: Earthquake tremors were felt in Nanded, Hingoli and Parbhani districts of Marathwada region in the state. 

The tremors were recorded between 1.37 am and 3.23 am and measured between 3.6 and 4.6 on the Richter scale. pic.twitter.com/i9pxCOhc9i

— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2026 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)