నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి
Breaking News
లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు
Published on Mon, 12/18/2023 - 17:01
లఢక్: లఢక్‌లోని కార్గిల్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.
An earthquake of magnitude 5.5 on the Richter Scale hit Kargil, Ladakh at around 3:48 pm today: National Center for Seismology pic.twitter.com/Z5bBYur7y4
— ANI (@ANI) December 18, 2023
రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి.
ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం
Tags : 1