Breaking News

మహారాష్ట్ర: నాందేడ్‌లో భూకంపం.. 3.8 తీవ్రత నమోదు

Published on Tue, 10/22/2024 - 11:28

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈరోజు (మంగళవారం) భూకంపం సంభవించింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.

భారతదేశ భూకంప పటంలో నాందేడ్.. జోన్ IIలో ఉంది. ఈ ప్రాంతంలో  భూకంపం సంభావ్యత తక్కువగా  ఉంటుంది. ఈ నగరం మహారాష్ట్రలోని మరఠ్వాడా డివిజన్‌లో గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. 

ఇది కూడా చదవండి: కమల ఇంటర్వ్యూ ఎడిట్‌ చేశారు: డొనాల్డ్‌ ట్రంప్‌ 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)