Breaking News

‘వరమా?.. శాపమా?’ ప్రశ్నిస్తున్న దుర్గా మండపం

Published on Sun, 09/28/2025 - 13:36

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ఆకృతులతో మండపాలను రూపొందించి, భక్తులు అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కోల్‌కతాలోని జగత్ ముఖర్జీ పార్క్‌లో ఏర్పాటుచేసిన  దుర్గా మండపం అటు సాంకేతికతను ఇటు సంప్రదాయాన్ని మిళితం చేసింది.

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బూన్ ఆర్ బానే’(కృత్రిమ మేథ: వరమా? శాపమా?) అనే థీమ్‌తో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోతున్నదీ ఈ మండపంలో చూపించారు. మానవులు, రోబోలు  కలసిమెలసి ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మానవ విలువలపై సాంకేతిక ఆధిపత్యం ప్రత్యక్షంగా ఇక్కడ చూపించారు. కళాకారుడు సుబల్ పాల్ రూపొందించిన ఈ మండపం ఒక పెద్ద టైమ్ మెషీన్‌ మాదిరిగా కనిపిస్తుంది. సందర్శకులు లోపలికి వెళ్ళేటప్పుడు రోబోటిక్ నగరానికి వెళుతున్నట్లు ఫీల్‌ అవుతారు.

మండపమంతా లైట్లతో నిండి ఉంది. కీబోర్డులను పై నుంచి వేలాడదీశారు. ఎత్తైన నిర్మాణాలు చుట్టుపక్కల కనిపిస్తాయి.  ప్రొజెక్షన్ల ద్వారా సాంకేతికత  మానవ జీవితాన్ని ఎలా బోనులో బంధించిందో చూపించారు. అయితే అమ్మవారి విగ్రహం సాంప్రదాయ రూపంలోనే ఉంది. ఆమె పాదాల వద్ద మహిషాసురుడు భూమి నుండి కొంచెం పైకి లేచి కనిపిస్తున్నాడు. కాగా జగత్ ముఖర్జీ పార్క్‌లో ప్రతీయేటా నిర్వహిస్తున్న దుర్గా పూజలు 89వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి.  ఈ మండపంలో బొంగావ్ లోకల్ రైలు మొదలుకొని నీటి అడుగున నడిచే మెట్రో మార్గాల వరకు అన్నింటినీ కూడా ప్రదర్శించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)