Breaking News

రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ పట్టివేత

Published on Sun, 10/06/2024 - 14:17

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ  డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌, వాటి  తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్‌ , ఎన్‌సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు  మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.

చదవండి: ఆపరేషన్‌ తోడేలు సక్సెస్‌.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)