Breaking News

అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి..

Published on Sat, 12/23/2023 - 18:18

అరేబియా సముద్రం ద్వారా భారత్‌ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్‌ తీరంలో డ్రోన్‌ దాడి జరిగింది. పోరుబందర్‌ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్‌ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. 

ఈ విషయాన్ని బ్రిటన్‌ సముద్ర మారిటైమ్‌ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్‌ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్‌ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్‌ అలర్ట్‌ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. 

ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌ ఘటనాస్థలానికి వెళ్లి  వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది.  అయితే.. ఆ నౌకపై డ్రోన్‌ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
చదవండి: Temple Vandalised: భారత్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)