Breaking News

చొరబాటుదార్లను తరిమికొట్టాలి

Published on Sun, 11/03/2024 - 05:56

రాంచీ:  అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. 

సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. 

భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్‌ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్‌ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.  

అస్సాంలో జార్ఖండ్‌ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్‌ సోరెన్‌ 
అస్సాంలో జార్ఖండ్‌ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. జార్ఖండ్‌ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్‌ మాట్లాడారు. జార్ఖండ్‌ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్‌ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్‌ సోరెన్‌ ధీమా వ్యక్తంచేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)