Breaking News

బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం

Published on Tue, 04/22/2025 - 08:27

రాయచూరు రూరల్‌(కర్ణాటక): పాగల్‌ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది.  పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్‌ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో భయపడి గదగ్‌ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్‌ (29) డెత్‌నోట్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. 

పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్‌ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్‌ రాసి ఉరివేసుకుని చనిపోయింది.   

ఆటల్లో ఆమె మేటి  
సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్‌లో డ్రిల్‌ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు.

 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు