Breaking News

Rajasthan: డీఆర్డీఓలో ఉంటూ పాక్‌కు రహస్యాలు.. గెస్ట్‌హౌస్‌ మేనేజర్‌ అరెస్ట్‌

Published on Wed, 08/13/2025 - 11:42

జైసల్మేర్‌: డీఆర్డీఓ శాస్త్రవేత్తల, భారత ఆర్మీ అధికారుల రహస్య వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు  ఎదుర్కొంటున్న డీఆర్డీఓ ఉద్యోగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో మహేంద్ర ప్రసాద్‌ను  రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.

మహేంద్ర ప్రసాద్‌ భారతదేశానికి సంబంధించిన రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం అతనిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తరువాత తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తీసుకువెళ్లనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలోని భద్రతను చురుకుగా పర్యవేక్షిస్తోందని రాజస్థాన్, జైపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి (సెక్యూరిటీ), డాక్టర్ విష్ణుకాంత్  మీడియాకు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు  చెందిన కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్‌ పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తున్నట్లు సీఐడీ నిఘా సమయంలో వెల్లడయ్యింది. క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలిక గురించి అతను పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.

జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థలు నిందితుడిని సంయుక్తంగా విచారించాయి.  మహేంద్ర ప్రసాద్‌ మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించగా, అతను డీఆర్‌డీఓతో పాటు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిర్వాహకులతో పంచుకుంటున్నాడని స్పష్టమయ్యింది. ఈ నేపధ్యంలో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)