Breaking News

రాకెట్‌ స్లెడ్‌ పరీక్ష దిగ్విజయం

Published on Wed, 12/03/2025 - 05:47

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్‌ వ్యవస్థ తాలూకు రాకెట్‌ స్లెడ్‌ పరీక్షను దిగ్విజయంగా జరిపింది. ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అత్యంత అపరిమిత వేగంతో కూడిన ఈ పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌ డీఓ) మంగళవారం విజయవంతంగా జరిపింది. ఎయిర్‌ క్రూ రికవరీతో పాటు పలు కీలక భద్రతా పరిమితులను విజయవంతంగా సాధించింది. ‘చండీగఢ్‌ లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ లో ఉన్న రైలు ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ వేదికగా గంటకు ఏకంగా 800 కి.మీ. నియంత్రిత వేగంతో ఈ పరీక్షను నిర్వహించారు.

కనోపీ సెవెరెన్స్‌ ఎజెక్షన్‌ సీక్వెన్సింగ్‌ తో పాటు పూర్తిస్థాయిలో ఎయిర్‌ క్రూ రికవరీ వంటి అన్ని లక్ష్యాలనూ ఈ పరీక్ష సాధించింది‘ అని రక్షణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల క్లబ్‌లో భారత్‌ సగర్వంగా నిలిచిందని తెలిపింది. డీఆర్‌ డీఓతో పాటు వాయు సేన, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, హిందూస్తాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ లను రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అభినందించారు. మన దేశీయ రక్షణ సామర్థ్యాల పెంపులో స్వావలంబన దిశగా కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో దీనిని ఒక మైలురాయిగా ఆయన అభివరి్ణంచారు. 

ఏమిటీ స్లెడ్‌ టెస్టు? 
విమానం గాల్లో అత్యధిక వేగంతో ఎగిరేటప్పటి పరిస్థితులను రాకెట్‌ స్లెడ్‌ పద్ధతిలో నేల మీదే కృత్రిమంగా సృష్టిస్తారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు పట్టాలపై రాకెట్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)