Breaking News

వీర్ సావర్కర్‌ అవార్డా.. అదేంటో తెలియదు!

Published on Wed, 12/10/2025 - 13:56

కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయనకు ప్రకటించిన వీర్ సావర్కర్‌ అవార్డును తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అసలు ఆ ‍పురస్కారాన్ని ఎందుకు ప్రదానం చేస్తారో తనకు తెలియదని దాని గురించి ఎటువంటి సమాచారం లేదని  మీడియాతో అన్నారు.

వీర్ సావర్కర్ అవార్డు ప్రకటించడంపై ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ "మీడియా ప్రతినిధుల ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. నేను నిన్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు నన్ను ఈ విషయం అడిగారు. అప్పుడు ఈ ‍అవార్డు నాకు ప్రకటించారని, ఢిల్లీలో ఈ రోజు దానిని అందుకోవాలని తెలిసింది. అవార్డు ఇచ్చే సంస్థ కనీసం నన్ను సంప్రదించకుండా నాకు అవార్డు ప్రకటించడం మంచి పద్దతి కాదు. ఇది చాలా నిర్లక్ష‍మైన చర్య" అని శశి థరూర్ అన్నారు.

అసలు ఆ అవార్డు యెుక్క ఉద్దేశం ఏమిటో? దానిని ఎందుకు ఇస్తారో తెలియకుండా.. పురస్కారం తీసుకునే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతోంది ‍అర్ధం కావడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నలనుద్దేశించి శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ ఇంపాక్ట్ అవార్డు-2025 ను హైరేంజ్ రూరల్ సొసైటీ అనే ఎన్జీవో సంస్థ అందిస్తుంది. ఈ పురస్కారాన్ని సమాజాన్నిప్రభావితం  సాంస్కృతిక కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హాజరుకానున్నారు.

కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్‌ తీరుపై ఆ పార్టీ ‍అధిష్ఠానం కొంత అసహానంతో ఉంది. ఈ మధ్య కొన్ని సార్లు కేంద్రానికి మద్దతుగా శశిథరూర్ మాట్లాడారు. దీంతో ఆయన వ్యవహారంపై కాంగ్రెస్ కొంత కోపంగా ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)