Breaking News

‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’

Published on Mon, 10/21/2024 - 12:08

దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం  ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్‌ సింగ్‌  ప్రయాణికులను హెచ్చరించాడు.

భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్‌జేఎఫ్‌) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. 

గతేడాది కూడా నవంబర్‌ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.

అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను  2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)