Breaking News

వేధింపులపై మహిళలకు కీలక సందేశం : ఐశ్వర్యారాయ్‌ వీడియో వైరల్‌

Published on Thu, 11/27/2025 - 16:06

మహిళలపై వేధింపులపై మాజీ విశ్వ బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ Aishwarya Rai Bachchan కీలక వ్యాఖ్యలు చేశారు.  వీధి వేధింపులు,  బాధితులను నిందించడంపై ఐశ్వర్య రాయ్ ఆమె స్పందిస్తే, ఇందులో మహిళలు, లేదా అమ్మాయిల తప్పు ఎప్పుడూ లేదన్నారు. లోరియల్ పారిస్ స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో ఆమె ఐశ్వర్య రాయ్ వీధి వేధింపుల (Street harassment )పై మాట్లాడారు. బాధితులనే  నిందించే వైఖరిని కూడా ఆమె తప్పు బట్టారు.

గతరెండు దశాబ్దాలుగా  గ్లోబల్‌ బ్యూటీ  బ్రాండ్‌ లోరియల్ పారిస్‌కి  అంబాసిడర్‌గా ఉన్న ఐష్‌  వీధి వేధింపులకు వ్యతిరేకంగా బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్నారు.  ధైర్యంగా తలపైకెత్తుకుని నిలబడండి..  గౌరవం విజయంలో రాజీపడకండి, వీధి వేధింపులకు వ్యతిరేకంగా పోరాటంలో చేరండి. స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో చేరండి  అని లోరియల్‌ పిలుపునిచ్చింది.

 ఈ ప్రచారంలో భాగంగా ఐశ్వర్యారాయ్‌ వీధి వేధింపుల గురించి మహిళలకు ఇలా సందేశమిచ్చారు "మీ దుస్తులను లేదా లిప్‌స్టిక్‌ను నిందించవద్దు.. వీధి వేధింపులు, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు?" అంటే ఒక వీడియోలో సూచనలు చేశారు. అవేంటంటే.. వారి కళ్లలోకి చూడకుండా ఉండాలి..  కానే కాదు కాదు,  "సమస్యను నేరుగా కళ్ళలోకి చూడండి.తల ఎత్తి ధైర్యంగా ఉండాలి.  స్త్రీగా స్త్రీవాదిగా ఉండాలి.   నా శరీరం. నా విలువ," అనే  సందేశాన్నిచ్చారు. మిమ్మల్ని మీరు అనుమానించకోకండి.  మీకోసం మీ విలువ విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి.  వాల్యూకోసం నిలబడండి.  అంతేకాదు  మీ  దుస్తులను లేదా మీ లిప్‌స్టిక్‌ను నిందించవద్దు. వీధి వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదుఅంటూ ఆమె ముగించారు.

చదవండి: డీకేకి చాన్స్‌ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్‌ ఏంటి?

ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు  ప్రముఖ సెలబ్రిటీలు అమెరికన్ నటి అరియానా గ్రీన్‌బ్లాట్, ఇంగ్లీష్ నటుడు సిమోన్ ఆష్లే, ఇటాలియన్ హై జంపర్ జియాన్మార్కో టాంబేరి , ఫార్ములా 1 డ్రైవర్ కార్లోస్ సైన్జ్ ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం విశేషం.

కాగా 2012 గాలప్ నివేదిక ప్రకారం, 143 దేశాలలో పురుషులతో పోలిసతే, మహిళలు రాత్రిపూట ఒంటరిగా నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.  2011లో నిర్వహించిన సర్వేల నుండి ఈ డేటాను తీసుకున్నారు. స్టాప్ స్ట్రీట్ హరాస్‌మెంట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న 79శాతం మంది మహిళలు బహిరంగంగా హింస లేదా వేధింపులకు గురవు తున్నారు. ఈ డేటా బ్రెజిల్‌లో 89శాతం, యూకేలోని  లండన్‌లో  75శాతం గా ఉంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)