Breaking News

Air India Crash: అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొంటూ... ‘ఏకైక’ ప్రయాణికుని దుస్థితి

Published on Sun, 07/13/2025 - 07:26

అహ్మదాబాద్: విశ్వాస్ కుమార్ రమేష్... జూన్ 12న జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. ఈయన ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా 270 మంది మరణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఫుటేజ్‌లో రమేష్ రక్తంతో తడిసి, అంబులెన్స్ వైపు కుంటుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ‍ప్రమాదం జరిగి, నెల రోజులు గడిచిన దరిమిలా విశ్వాస్ కుమార్ రమేష్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు?

అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ విషాదాన్ని మరువలేకపోతున్నాడు. ఈ ఘటన రమేష్‌ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. అతని బంధువు సన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్‌ను వెంటాడుతున్నాయి. అతను ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం, అతని సోదరుని మరణం మొదలైన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. విదేశాలలో  ఉంటున్న మా బంధువులు.. రమేష్‌  తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.  అయితే రమేష్‌ ఎవరితోనూ మాట్లాడటం లేదు. విమాన ప్రమాదం, అతని సోదరుని మరణం దరిమిలా అతనికి అయిన గాయం ఇంకా మానలేదు. రమేశ్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడు. తరువాత నిద్రపోవడం లేదు. చికిత్స కోసం మేము అతనిని రెండు రోజుల క్రితం మానసిక వైద్యనిపుణుని వద్దకు తీసుకెళ్లాం. అతనికి ఇప్పుడే చికిత్స ప్రారంభమైనందున, లండన్‌ వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్‌ వేసుకోలేదు’ అని తెలిపారు.

జూన్ 17న రమేష్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయిందని వివరించాడు. తన సీటు, 11ఏ.. ఎడమ వైపున ఉన్న అత్యవసర తలుపుకు దగ్గరగా ఉందని తెలిపారు.  జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని  మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోకి కూలిపోయింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)