Breaking News

ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు

Published on Sat, 08/10/2024 - 10:45

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.

గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి  రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్‌వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.

భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్‌ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్‌ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.

ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో  పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)