Breaking News

మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..

Published on Sat, 10/19/2024 - 19:38

సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా.. ఎక్కువైంది. మళ్లీ ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అలా 12 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూనే ఉంది. తాజాగా ఈనెలలో మరోసారి ఆసుపత్రికి వెళ్లగా.. కడుపు నొప్పికి గల కారణం తెలిసి కుటుంబం షాక్‌కు గురైంది. సదరు మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అసలేం జరిగిదంటే.. 45 ఏళ్ల మహిళ 2012లో  గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ హాస్పిటల్‌లో  అపెండిక్స్‌ ఆపరేషన్‌ చేయించుకుంది. ఈ తరువాత ఊడా ఆమెకు కడుపులో నొప్పి కొనసాగుతూనే ఉంది. చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. తిరిగి వస్తూనే ఉంది. ఇలా పదేళ్లకుపైగా బాధపడుతూనే ఉంది. అక్టోబర్ 8న, ఆమె మళ్లీ ఎస్టీఎన్‌ఎమ్‌ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్-రేలో ఆమె కడుపులో శస్త్రచికిత్స కత్తెర ఉన్నట్లు బయటపడింది. 12 క్రితం అపెండిక్స్‌ ఆపరేషన్‌ చేసుకున్న సమయంలో వైద్యులు ఆమె కడపులో ఓ కత్తెరను పెట్టి మర్చిపోయినట్లు తేలింది.

అయితే ఇన్నేళ్లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా వైద్య నిపుణుల బృందం వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)