Air India Flight: విమానంలో వైద్యురాలు హల్‌చల్‌

Published on Sat, 06/21/2025 - 09:09

కర్ణాటక: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో క్యాబిన్‌ సిబ్బందితో వాగ్వాదం జరిపి నిందించిన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు నుంచి సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఐఎక్స్‌ 2749 విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది. 

యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి వైద్యురాలు వ్యాస్‌ హిరాల్‌ మోహన్‌ భాయ్‌ తనకు కేటాయించిన సీట్‌ నంబర్‌– 20లో కూర్చోడానికి ముందు ముందు వరుసలో ఉన్న సీట్లో తన బ్యాగులను ఉంచింది. దీన్ని ప్రశ్నించిన సిబ్బందితో ఆమె తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. అందరినీ నిందిస్తూ బాంబు పెట్టి విమానాన్ని పేల్చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయింది. పైలట్, విమాన సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆమె తగ్గలేదు. తోటి ప్రయాణికులతో కూడా గొడవ పడింది. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)