Breaking News

డాక్టర్‌ ఆకస్మిక మృతి.. చేతబడే కారణామా?

Published on Tue, 07/08/2025 - 14:02

కర్ణాటక: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాలనాధికారిగా ఉన్న డాక్టర్‌ వసంతకుమార్‌ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి విదితమే. సోమవారం ఆయన ఉన్న కార్యాలయం గదిని సిబ్బంది తెరచిన సమయంలో గదిలో చేతబడి చేసిన గుర్తులు కనిపించి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. 

మాలూరు నగరంలోని ఆస్పత్రిలో డాక్టర్‌ వసంతకుమార్‌ కంటి వైద్య నిపుణులుగా గత 10 సంవత్సరాలుగా పని చేసి అనంతరం ఆస్పత్రి వైద్యాధికారిగా నియమితులయ్యారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత నెల 5వ తేదీన బెంగళూరు నుంచి రైలులో మాలూరుకు వస్తుండగా తీవ్ర గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించారు. 

సోమవారం ఉదయం ఆస్పత్రిలోని ఆయన గదిని తెరచిన సమయంలో చేతబడి చేసిన విషయం వెలుగు చూసింది. గదిలో మరణించిన రెండు గబ్బిలాలు, బీరువాలో చేతబడికి ఉపయోగించిన బొమ్మలు కనిపించాయి. విషయాన్ని వసంతకుమార్‌ కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వైద్యుడు వసంతకుమార్‌ గుండెపోటుతో మరణించడానికి చేతబడికి ఏదైనా సంబంధం ఉందా? చేతబడి ఎవరు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు.    

 

 

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)