Breaking News

ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్‌లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్‌

Published on Mon, 06/17/2024 - 09:46

ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. చికిత్స అందించే విధానాల్లో నూతన ప్రక్రియలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన వైద్యులు మరో అద్భుతం చేసి  అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఢిల్లీలో  చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగికి 40 కి.మీ. దూరం నుంచి టెలీసర్జరీ టెక్నిక్ ద్వారా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో, రోగికి కోత పెట్టడం నుంచి కణితిని తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వరకు మొత్తం ప్రక్రియ పూర్తయింది. డార్క్ గ్లాసెస్ ధరించి, రోబోట్‌ను ఆపరేట్ చేస్తూ, వైద్యులు రోగి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ ప్రభావిత కణాలను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వారంలో బాధితుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.

వైద్యుల బృందం గురుగ్రామ్‌లోని ఎస్‌ఎన్ ఇన్నోవేషన్‌లో ఉండగా, 52 ఏళ్ల రోగి ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స అందుకున్నాడు. ఆపరేషన్ సమయంలో ఇంటర్నెట్‌తో పాటు సాంకేతికతకు అంతరాయం ఏర్పడకుండా వైద్యప్రక్రియ విజయవంతంగా జరిగింది. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, జెనిటో-యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ రావల్‌తో పాటు అతని వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా డాక్టర్ రావల్ మాట్లాడుతూ దేశంలోని ఏ మూలన ఉన్న రోగులకైనా టెలిసర్జరీ ద్వారా చికిత్స సాధ్యమవుతుందన్నారు. ఆపరేషన్ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాను ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నట్లు భావిస్తూ, పేషెంట్ ఎదురుగా పడుకుండగా మానిటర్‌లో చూస్తూ చికిత్స చేశానన్నారు. సాధారణ ఆపరేషన్‌లో రోగి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్‌లో త్రీడీ నాణ్యతతో  మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఈ ఆపరేషన్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా జరిగింది. దీనికి ఐదు సన్నని రోబోటిక్ చేతులు ఉన్నాయి. దీనికి త్రీడీ హెచ్‌డీ సెట్‌ అనుసంధానమై ఉంది. ఇది సర్జన్‌కు మరింత స్పష్టమైన దృశ్యం కనిపించేలా చేస్తుంది.ఈ పద్ధతిలో రోగి చిన్నపాటి కోతకు గురవుతాడు. రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. క్యాన్సర్‌ సోకిన అవయవం లేదా కణం తొలగించిన తర్వాత, కుట్లు వేస్తారు.ఈ పద్ధతిలో రోగి సంప్రదాయ శస్త్రచికిత్సా విధానం కంటే త్వరగా కోలుకుంటాడు. బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యుల దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)