Breaking News

బెంగాల్‌లో పేషెంట్‌పై డాక్టర్‌ అఘాయిత్యం

Published on Wed, 10/30/2024 - 19:37

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ రోగిపై డాక్టర్‌  చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాల‌లోని హస్నాబాద్‌లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్‌  సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. 

వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్‌హాట్ ప్రాంతంలోని డాక్టర్‌ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.

ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు  బరున్‌హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం,  హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)