Breaking News

‘మీకు కన్నడ వచ్చా?’.. సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి సమాధానం ఇదే..

Published on Tue, 09/02/2025 - 09:59

బెంగళూరు: దక్షిణాదిలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కర్ణాటకలో భాషా సెగ తగిలింది. దీనిని ఆమె అత్యంత తెలివిగా తప్పించుకున్నారు. మైసూర్‌లోని అలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నాటక సీఎం సిద్దరామయ్య ..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.

రాష్ట్రపతిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య  ‘మీకు కన్నడ వచ్చా?’ అని అడిగారు. అందుకు ఆమె నవ్వుతూ ‘రాదు’ అని సమాధానమిస్తూ.. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి నా మాతృభాష కన్నడ కాదు. అయితే నాకు దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు, ఆచారాలు అంటే ఎంతో ఇష్టం. ప్రతీ భాషపై నాకెంతో గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను బతికించుకునేందుకు తాపత్రయపడుతుంటారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను తమ పిల్లలకు నేర్పిస్తారు. అలా చేస్తున్నవారందరికీ  నా అభినందనలు. ఇక కన్నడ విసయానికొస్తే.. ఈ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాను’ అని ముర్ము అన్నారు.
 

మూడు రోజుల పర్యటనలో భాగంగా  ద్రౌపది ముర్ము మైసూర్ విమానాశ్రయం చేరుకున్నాక ఆమెకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, సీఎం సిద్ధరామయ్య  ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ముర్ము ఏఐఐఎస్‌హెచ్‌ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కన్నడలో ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం రాష్ట్రపతి వైపు చూసి నవ్వుతూ.. మీకు కన్నడ వచ్చా? అని అడిగారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మంత్రులు, సీనియర్ నేతలు, బీజేపీ ఎంపీ యుధ్‌వీర్ తదితరులు పాల్గొన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)